- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Job Portal: ఉద్యోగాల దరఖాస్తు కోసం సింగిల్ జాబ్ పోర్టల్ రూపొందించే పనిలో కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో: ఒక్కో ఉద్యోగానికి ఒక్కో ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుని దరఖాస్తు చేయడం, దానికోసం సమయం వృధా చేసుకోవడం ఉద్యోగం వెతికేవారికి ఎంతో విసుగు కలిగిస్తుంది. దీనికి పరిష్కారంగా కేంద్రం అన్నిటికీ ఒకే జాబ్ అప్లికేషన్ పోర్టల్‌ను రూపొందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి డా జితేంద్ర సింగ్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 ప్రాంతీయ భాషల్లో రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంగ్లీష్, హిందీల్లో మాత్రమే జరిగే పరీక్షలు ఎక్కువ భాషల్లో నిర్వహించడంపై మంత్రి ప్రశంసించారు. ఇదే సమయంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కాలాన్ని దాదాపు 15 నెలల నుంచి 8 నెలలకు తగ్గించామని చెప్పారు. టెక్నాలజీతో ఆధారిత సంస్కరణల ద్వారా నియామక ప్రక్రియను క్రమబద్దీకరించడం సాధ్యమవుతోందన్నారు. రానున్న రోజుల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం-2024 ద్వారా మరిన్ని సంస్కరణలు ఉంటాయన్నారు. అందులో భాగంగానే సింగిల్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ తీసుకురావాలని, తద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారిపై అదనపు భారం ఉండదని, వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లను వెతకడం, సమయం అదా అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.