MohanLal : భార్యను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం : మోహన్ లాల్

by M.Rajitha |
MohanLal : భార్యను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం : మోహన్ లాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్(Mohan Lal) పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(PruthviRaj Sukumaran) డైరెక్షన్లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా "ఎల్ 2 : ఎంపురాన్."(L 2: Empuron) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. శనివారం హైదరాబాద్(Hyderabad) లో ప్రీరిలీజ్(Pre Release) ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహించారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు మోహన్ లాల్ ఫన్నీ కామెంట్స్ చేశారు.

భార్యను ఇంప్రెస్ చేయడం ఎలా అని యాంకర్ అడగ్గా.. ఇది కాస్త కఠినమైన ప్రశ్న అన్న ఆయన.. ఏది ఏమైనా భార్యను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం అన్నారు. ఇన్ని దశాబ్దాల మా బంధంలో ఇంకా కొత్తగా ఇంప్రెస్ చేయడానికి ఏమీ లేదని తెలిపారు. కాగా ఎల్ 2.. లూసిఫర్(Lucifer) కు సీక్వెల్. మలయాళీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. దానిని మించి ఇది డైరెక్టర్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed