- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ananya Nagalla: దయచేసి అందరూ నన్ను క్షమించండి.. తప్పు చేశానంటూ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: గత రెండు మూడు రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ యాప్స్ ప్రమోషన్ చేయడంలో పలువురు ఇన్ల్ఫూయెన్సర్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ఈ విషయంలో కొందరు హీరోయిన్లు, హీరోల మీద కేసు నమోదు అయినట్లు టాక్. అంతేకాకుండా కొందరు విచారణకు కూడా హాజరయ్యారు. ఈ కేసుల విషయంలో కొందరు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె నెట్టింట విమర్శలు ఎదుర్కొంటుంది.
తాజాగా, అనన్య నాగళ్ల(Ananya Nagalla)కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుస పోస్టులు పెట్టింది. ‘‘దయచేసి నన్ను క్షమించండి. నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఆ సమయంలో ఆలోచించకుండా అవగాహన లేకుండా చేశాను. ఒక వీడియో స్టోరీ పెట్టినందుకు రూ.1,20,000 ఇచ్చారు. అప్పుడు అదొక గేమింగ్ యాప్, దీనికోసం ఒక యాడ్ చేస్తున్నానని మాత్రమే అనుకున్నాను. కానీ ఇది బెట్టింగ్ యాప్ అని దీని వెనుక ఇన్ని ఇబ్బందులు ఉంటాయని అంత ఆలోచన రాలేదు. ఆ తర్వాత వాళ్లు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాను’’ అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అనన్య నాగళ్ల పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఒక మంచి హోదాలో ఉండి అలాంటి పనులు చేయడమేంటని అంటున్నారు. కాగా, అనన్య నాగళ్ల సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘వకీల్ సాబ్’(Vakeel Saab)చిత్రంలో కీలక పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది. ఇక గత ఏడాది ‘పొట్టేల్’(Pottel)మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అనన్య సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ నెట్టింట హవా చేస్తోంది.
Read More..