- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేటగాళ్ల ఉచ్చుకి యువకుడు బలి..

దిశ, కారేపల్లి : వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు దుండగులు అమర్చిన విద్యుత్తు తీగలు ఓ నిండు ప్రాణాలు తీశాయి. తన మేకలను వెతుక్కుంటూ వెళ్లిన ఓ యువకుడు వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలు తగిలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మండలంలోని చీమలపాడులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం చీమలపాడు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు మేకల కోటయ్య, కరుణాకర్ లు ఇద్దరు కలిసి తమ మేకలు తప్పిపోవడంతో రాత్రి వాటిని వెతుక్కుంటూ పాటిమీద గుంపు పంచాయతీ శివారున బోద్దు బండా వాగు వైపు వెళ్లారు.
ఆ ప్రాంతంలోనే కొందరు దుండగులు అడవి జంతువుల కోసం ఉచ్చులు బిగించారు. వాటికి కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. కంటికి కనిపించకుండా ఏర్పాటు చేయడంతో మేకల కరుణాకర్ (18) వాటిని గమనించకుండా అలాగే ముందుకు వెళ్లాడు. దీంతో ఆ యువకుడికి కరెంట్ ఉచ్చులు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.