- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కాంపార్ట్‌మెంట్లలో భక్తులు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవాస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తుల తాకిడి మరోసారి పెరిగింది. వీకెండ్ కావడంతో శుక్రవారం రాత్రి నుంచి భక్తులు పెద్ద మొత్తంలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయం ఎండలు దంచికొడుతుండటంతో.. తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రయత్నిస్తుండటంతో.. 31 కంపార్ట్మెంట్ల (31 compartments)లో భక్తులు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం (18 hours for Srivari Darshan) పడుతుంది. ఇదిలా ఉంటే శుక్రవారం రోజు తిరుమల స్వామివారిని 64,170 మంది భక్తులు దర్శించుకున్నారు.
దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో భక్తులు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. త్వరితగతిన స్వామి వారి దర్శనం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మనవడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన మనవడు దేవాన్ష్, మంత్రి లోకేష్ లు అన్నదానం చేశారు. ఇందులో భాగంగా భక్తులతో కలిసి వారు కూడా భోజనం చేశారు. దీంతో నిన్న తిరుమలలో కోలాహలం నెలకొంది.