ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఏవి..?

by Naveena |
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఏవి..?
X

దిశ,మర్పల్లి : ఈ సమాజంలో ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారస్తులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసి లాభాలు గడిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు నాణ్యతలేని సరుకులతో తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. మండల కేంద్రంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పలువురు భోజన ప్రియులు విమర్శిస్తున్నారు. అపరిశుభ్రతో,కల్తి కిరాణా సామాన్లతో అడ్డగోలుగా ఫాస్ట్ ఫుడ్ నిర్వహణ చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పందించి మండల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి అపరి శుభ్రంగా ఉన్న పాస్ట్ ఫుడ్ సెంటర్ లపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story