- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR : ఆసుపత్రిలో లేడీ కానిస్టేబుల్ ను పరామర్శించిన కేటీఆర్
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదివారం కరీంనగర్లో(Karimnagar) పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఘనస్వాగతం పలుకుతూ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ(Bike Rally) తీస్తుండగా.. ఓ యువకుడు అనుకోకుండా బందోబస్తుకు వచ్చిన లేడీ కానిస్టేబుల్ (Woman Constable) పద్మజను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS) కార్యకర్తల సమావేశం అనంతరం కేటీఆర్ లేడీ కానిస్టేబుల్ ను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పద్మజకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు బి.వినోద్ కుమార్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story