- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీలో వలసలు.. రంగంలోకి ట్రబుల్ షూటర్

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జీవీఎంసీ(Gvmc) మేయర్ పీఠాన్ని దక్కించేందుకు టీడీపీ(Tdp) చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ(Ycp) చెక్ పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ(Former Minister and MLC Botsa Satyanarayana)ను ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. దీంతో వైసీపీ కార్పొరేటర్లతో ఆయన భేటీ అయ్యారు. ఇటీవల పార్టీని వీడిన కార్పొరేటర్లతో సైతం బొత్స టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ మేయర్‌పై టీడీపీ, జనసేన కార్పొరేటర్లు పెడుతున్న అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ వలసలను నిలిపేందుకు అవసరమైతే వైసీపీ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించాలని భావిస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాసం పరీక్ష రోజు మళ్లీ విశాఖకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కూటమి నాయకులు సైతం విశాఖ పీఠాన్ని దక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షిస్తూ ఇప్పటికే బలాన్ని పెంచుతున్నారు. మేయర్ పీఠం దక్కించుకనేందుకు సరిపడా కార్పొరేటర్ల తమ వైపు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతూ కలెక్టర్‌కు లేఖలు అందజేశారు. మరి మేయర్ పీఠం ఎవరికి దక్కుందో చూడాలి.