- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Assam: అసోంలో 11వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

దిశ, నేషనల్ బ్యూరో: అసోం రాష్ట్ర విద్యాశాఖ పదకొండో తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసింది. పేపర్ లీక్‌ల నివేదికల నేపథ్యంలో పరీక్షలు రద్దు చేసినట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. మార్చి 24 నుండి 29 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. వాటిలో 36 సబ్జెక్టులు ఉన్నాయి. సోమవారం కొత్త తేదీలపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. పరీక్షకు ఒక్కరోజు ముందు మాథ్య్స్ పేపర్ లీకయినట్లు నివేదికలు వచ్చాయన్నారు. "ప్రశ్నపత్రం లీక్, ప్రొటోకాల్ ఉల్లంఘన నివేదికల కారణంగా పదకొండో తరగతి మిగతా పరీక్షలు రద్దు చేశాం" అని మిస్టర్ పెగు మరొక పోస్ట్‌లో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన హయ్యర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ తర్వాత రద్దు చేసిన తర్వాత మిగతా పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన వెలువడింది. ఇకపోతే, పేపర్ లీకేజీపై దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అసోం ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి పెగు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసోం రాష్ట్ర బోర్డు చీఫ్ ఆర్ సీ జైన్ ను సస్పెండ్ చేయాలని నిరసన చేపట్టారు.