- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ విషయంలో బడే భాయ్, ఛోటే భాయ్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీఆర్ఎస్ నేత హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: బడే భాయ్, చోటే బాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (BRS MLA Jagadeesh Reddy) అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రుణమాఫీ మోసం.. బీజేపీ డీలిమిటేషన్ (Delimitation) కుట్రలపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోందని, రుణ మాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా రైతులను మోసం చేశారని, అసెంబ్లీ (Assembly) అని సోయి కూడా లేకుండా అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
అలాగే అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చేతులెత్తేశారని, చేయని రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అంతేగాక అమలు సాధ్యం కాదని తెలిసి అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు బ్యాంకులకు వెళ్ళండని రైతులతో రుణాలెత్తించి నట్టేట ముంచారని అన్నారు. బ్యాంకుల లెక్క ప్రకారం 49 వేల కోట్లు కానీ మాఫీ చేసింది 20కోట్ల లోపేనని, బ్యాంకులు చెప్పిన దానికి క్యాబినెట్, బడ్జెట్, అసెంబ్లీలోకి వచ్చే సరికి 30 శాతం మాఫీ కూడా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారని, రుణమాఫీ పోయింది, బోనస్ లేదు, సాగు నీళ్ళు లేవు.. అన్నిటికీ మొండి చేతులే చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ బావిస్తున్నట్లుందని, అందుకే సంక్షేమం మరచి జేబులు నింపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో మంత్రులు అబద్దాలు చెప్పిన సందర్భం చరిత్రలోనే ఎప్పుడూ జరుగలేదని, అసెంబ్లీలో అబద్దలాడిన రికార్డు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీల బాధ్యత పూర్తిగా మరిచారని, అసమర్ధ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారని తెలిపారు. ఇక నిధుల విషయంలో బడే భాయ్ దగ్గర మాట తీసికుని చోటే బాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, కిషన్ రెడ్డి అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా వ్యతిరేకత వస్తుందని, కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడితే చివరికి మోసమే ఎదురౌతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలు ఎట్టి పరిస్థితిలో సాగనీయమని, ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యత ముఖ్యమని చెబుతూ.. తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ (BRS) పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేత (BRS Leader) స్పష్టం చేశారు.