- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. 2 లక్షల కోళ్లను తొలగిస్తున్న అధికారులు

దిశ, వెబ్ డెస్క్: నెల రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ (Bird flu) మరోసారి విజృంభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ కొల్ల ఫామ్ అధికంగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ మరోసారి తిరగబడుతుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నల్లగొండ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలది కోళ్లు మృతి చెందగా అప్రమత్తమైన అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. వెంటనే చనిపోయిన కోళ్లను భారీ గోతిని తవ్వి అందులో పూడ్చిపెట్టి ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజులకే మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా (Joint Nalgonda District)ల్లో కోళ్లపై బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ (Red zone) గా ప్రకటించారు.
అనంతరం దాదాపు 2 లక్షల కోళ్లను తొలగిస్తూ.. బయో సెప్టీ చర్యలను (Bio-septic measures) తీసుకుంటున్నారు. కాగా నెల రోజుల క్రితం ఇలానే బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం సృష్టించగా.. చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. దీని కారణంగా ప్రజలు చికెన్, ఎగ్స్ తినడమే మానేశారు. దీంతో కోళ్లఫామ్ యాజమాన్యాలు.. తమ మనుగడను కాపాడుకోవడానికి.. చికెన్ తింటే ఎటువంటి సమస్యలు రావని బర్డ్ ఫ్యూ.. లేదని చెబుతూ.. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఉచితంగా చికెన్ వంటకాలు ప్రజలకు అందజేశారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ, ఏపీలో.. చికెన్ ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాపారులు, కోళ్ల ఫామ్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.