- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దశాబ్దాలుగా విద్యా వైద్యం లేని మాడ్గుల మండలం...

దిశ, మాడ్గుల : రాష్ట్ర ప్రభుత్వం మాడ్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా చేస్తూ 12.7 కోట్లు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేల్ల రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మాడ్గుల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మాడ్గుల మండలం దశాబ్దాలుగా విద్య వైద్యం లేక వెనుకబాటుకు గురైందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మాడ్గుల మండల కేంద్రంలో ఏడున్నర కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, జూనియర్ కాలేజీ కళాశాల అదనపు గదుల కోసం రెండు కోట్ల రూపాయలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 8 కోట్ల రూపాయలు, పీహెచ్సీ పరిధిని పెంచుతూ 30 పడకల ఆసుపత్రికి 12.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి, టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డికి, అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ సూదిని పద్మా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.