హైదరాబాద్‌లో ఆరేళ్లపాటు సహజీవనం.. సీన్ కట్ చేస్తే నెల్లూరులో ఆందోళన

by srinivas |
హైదరాబాద్‌లో ఆరేళ్లపాటు సహజీవనం.. సీన్ కట్ చేస్తే నెల్లూరులో ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) సంగంలో యువతి ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో ఆరేళ్ల పాటు తనతో మన్సూర్ అనే వ్యక్తి సహజీవనం చేశాడని, ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు ఫిబ్రవరి 7న, 2025లో తాము పెళ్లి చేసుకున్నామని, తనకు న్యాయం చేయాలని మన్సూర్ ఇంటి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు మన్సూర్ ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ మన్సూర్ తనను హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారని, ఆరేళ్ల పాటు ఒకే ఇంట్లో కూడా ఉన్నామని ఆమె తెలిపారు. తన భర్త తనకు కావాలని డిమాండ్ చేశారు. మన్సూర్ కోసం తన కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చానని వాపోయారు. తాము పెళ్లి చేసుకున్న విషయం మన్సూర్ కుటుంబానికి కూడా తెలిసని చెప్పారు. కులం పేరుతో తమను విడదీస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed