- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యవసాయ బావి వద్దకు వెళ్లొస్తూ విగత జీవిగా మారిన యువకుడు..
by Sumithra |

X
దిశ, సంగెం : సంగెం మండలం గవిచెర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు పొలం పనులు చూసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకెళితే గవిచర్ల గ్రామానికి చెందిన గాలి చందు (18) ద్విచక్ర వాహనం పై ఇంటి నుండి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. మొక్కజొన్న పంట చూసి తిరిగి వస్తున్న క్రమంలో రంగశాయి పేట నుంచి గవిచర్ల వైపు వెళుతున్న కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం పై ఉన్న గాలి చందు తీవ్ర గాయాల పాలు కాగా 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే తన కొడుకు మృతి చెందాడని, మృతుని తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story