AP News:కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి జనసేనకే!

by Jakkula Mamatha |
AP News:కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి జనసేనకే!
X

దిశ,కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి జనసేన హస్తగతమైంది. ఇప్పటి వరకు కాకినాడ రూరల్ ఎంపీపీ వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే 18 స్థానాలకు మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉండగా తాజాగా ఏడుగురు వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. ఎన్నికల సందర్భంగా వీరంతా లంబసింగి శిబిరంలో ఉన్నారు. గురువారం ఎంపీపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లంబసింగి నుంచి ఈ సభ్యులు నేరుగా గురువారం ఎండిఓ కార్యాలయానికి చేరుకుని ఎంపీపీని ఎన్నుకున్నారు.

తొలినుండి ఆ కుర్చీ తమదేనని జనసేన ధీమా వ్యక్తం చేస్తోంది. కాకినాడ రూరల్​ఎంపీపీ ఎన్నికను 8 మంది ఎంపీటీసీలు బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలోకి ఏడుగురు చేరారు. పది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే నానాజీ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్​ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Next Story

Most Viewed