రెండు రోజుల్లో బకాయిలు కట్టకుంటే సీజ్

by Sridhar Babu |
రెండు రోజుల్లో బకాయిలు కట్టకుంటే సీజ్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : రెండు రోజుల్లో బకాయిలు కట్టకుంటే సీజ్ చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఎక్కువగా బకాయిలు ఉన్న షాపింగ్ మాల్స్​ను సందర్శించారు. రెండు రోజుల్లో బకాయిలు కట్టకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని అధికారులను కోరారు.

ఈనెల 31 వరకు ఉన్న గడువులో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. గడువులోగా అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed