- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉగాది పండుగకు పస్తులు ఉండాల్సిందేనా.. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు

దిశ,అలంపూర్/మానోపాడు : రెక్కాడితే కానీడొక్కాడని కుటుంబాలు వారివి. కోడి కూయక ముందే నిద్రలేచి గ్రామాల్లోని చెత్తాచెదారం, మురుగును శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రతినిత్యం కాపాడుతుంటారు. అటువంటి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అధికారులను అడగలేక.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోలేక వస్తులుంటూ విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు చెప్పకపోవడం ఆశ్చర్యమేస్తుంది. అటువంటి పంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. అదిగో జీతం, ఇదిగో జీతం అంటున్నారే తప్ప సక్రమంగా జీతాలు అందుతున్న దాఖలాలు లేవు. దీంతో అర్ధాకలితో కాలం వెళ్ళ బుచ్చాల్సిన దుస్థితి నెలకొంది.
ఒక్క నెల జీతం అందకపోతే అవస్థలు పడే ఉన్నతాధికారులు తమకు అందే కొద్దిపాటి జీతాలను నెలల తరబడి చెల్లించకపోతే తాము ఎలా బతకాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక విధులు నిర్వహిస్తూ కుమిలిపోతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 8 మండలంలోని ఆయా గ్రామపంచాయతీ నందు పారిశుద్ధ్య కార్మికుల పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. రోజు పని చేయాలని.. పని చేయకపోతే మాత్రం చివాట్లు, విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ లు ఇస్తూ బెదిరింపులకు గురి చేస్తారు. జీతాలు మాత్రం చేయండి మహాప్రభు అని వేడుకున్న ఏ ఒక్కరు పట్టించుకోరు. ఉగాది పండుగ కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి మా కుటుంబాల్లో ఏర్పడ్డాయని ఆయా గ్రామాల పారిశుద్ధ్య కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక్క నెల జీతం అయినా అందిస్తే బాగుంటదని కోరుతున్నారు.