Elon Musk: సహ్‌యోగ్‌ను ‘సెన్సార్‌షిప్’ పోర్టల్‌గా పేర్కొనడంపై కేంద్రం అభ్యంతరం

by S Gopi |
Elon Musk: సహ్‌యోగ్‌ను ‘సెన్సార్‌షిప్’ పోర్టల్‌గా పేర్కొనడంపై కేంద్రం అభ్యంతరం
X

దిశ, బిజినెస్ బ్యూరో: హానికరమైన ఆన్‌లైన్‌ చట్టవ్యతిరేక సమాచారాన్ని నియంత్రించేందుకు రూపొందించిన 'సహ్‌యోగ్' పోర్టల్‌ను 'సెన్సార్‌షిప్' పోర్టల్‌గా లేబుల్ చేయడంపై ప్రపంచ బీలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. ఇది దురదృష్టకరం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తున్నదని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతున్న ఆరోపణలతో కేంద్రంపై ఎలన్ మస్క్ కర్ణాటక హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా అభ్యంతరాలను కోర్టు ముందు ఉంచింది. ఎక్స్ లాంటి అంతర్జాతీయ పోర్టల్ ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం దురదృష్టకరమని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. సెన్సార్‌షిప్ గురించి ఎక్స్ కంపెనీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. కొత్త వెబ్‌సైట్ సహ్‌యోగ్‌ను సైబర్‌ నేరాలు కట్టడి చేయడానికి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ తరఫున నోడల్‌ ఏజెన్సీ అయిన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) దీన్ని రూపొందించింది. ఇది ఆన్‌లైన్‌లో ఉండే హానికరమైన కంటెంట్ గురించి డేటాను కంపెనీలు తెలియజేసేందుకు ఉద్దేశైంచినది. సహ్‌యోగ్ వెబ్‌సైట్‌కు ఎలాంటి కంటెంట్ నిరోధించే ఆదేశాలు జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసిన ఎక్స్, చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను కట్టడి చేస్తోందని, ఏకపక్ష సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది.

Next Story

Most Viewed