చేతులు జోడించి అడుగుతున్నా.. దయచేసి అలా చేయడం ఆపేయండి.. సీఎంకు జాన్ అబ్రహం స్పెషల్ రిక్వెస్ట్

by Hamsa |
చేతులు జోడించి అడుగుతున్నా.. దయచేసి అలా చేయడం ఆపేయండి.. సీఎంకు జాన్ అబ్రహం స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, సినిమా: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మాకానికి పెట్టిన విషయం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. హెచ్ సీయుకు సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇప్పటికే పలువురు సినీ స్టార్స్, రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు దర్నా కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నినాదాలు చేస్తున్నారు. ఇంకా పలువురు అభ్యర్థిస్తున్నారు. జంతువులు ఇబ్బంది పడతాయని ఆ భూమిని అమ్మకానికి పెట్టొద్దని సీఎంను రిక్వెస్ట్ చేస్తున్నారు.

తాజాగా, ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం(John Abraham) చేరిపోయాడు. ఈ మేరకు.. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారూ, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల చెట్లు/అడవిని తొలగించే ప్రణాళికను రద్దు చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది నగరానికి పచ్చని ఊపిరితిత్తుగా, దశాబ్దాలుగా దానిలో అభివృద్ధి చెందుతున్న అనేక జాతుల రక్షిత వన్యప్రాణులకు ఆవాసంగా ఉపయోగపడుతుంది. చెట్లను క్లియర్ చేయడం వల్ల వన్యప్రాణులకు నివాసం లేకుండా పోతుంది. మానవ వన్యప్రాణుల సంఘర్షణను పెంచుతుంది. దయచేసి అలా చేయడం ఆపండి’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని షేర్ చేశాడు. ప్రజెంట్ జాన్ అబ్రహం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed