- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. ఎప్పుడంటే..?

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా కుండపోత వాన ఎక్కడో ఒక చోట పడుతునే ఉంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత మూడురోజుల్లో రెండు నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.
ఈ నెల 7న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 8న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.