- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బండి సంజయ్ ఫుల్ హ్యాపీ.. వారి తరపున ప్రధాని మోడీకి స్పెషల్ థాంక్స్

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) పొటాష్, పాస్ఫేట్ ఫెర్టిలైజర్లకు రూ.37,216 కోట్లు సబ్సిడీ కింద చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నిర్ణయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అన్నదాతలకు(Indian Farmers) ఎరువుల కష్టాలు తీర్చడానికి, అంతర్జాతీయ స్థాయి సబ్సిడీలను అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఖరీఫ్ 2025 కోసం న్యూట్రియంట్ ఆధారిత సబ్సిడీ (NBS) రేట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరం. సరసమైన ధరల్లో ఎరువులు అన్నదాతలకు లభించేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)కి అన్నదాతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు.. కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 2 శాతం డీఏ పెంచారు. డీఏ సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
అన్నదాతలకు ఎరువుల కష్టాలు తీర్చడానికి, అంతర్జాతీయ స్థాయి సబ్సిడీలను అందించడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రభుత్వం నిర్ణయించింది.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 28, 2025
ఈమేరకు ఖరీఫ్ 2025 కోసం న్యూట్రియంట్ ఆధారిత సబ్సిడీ (NBS) రేట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరం.
సరమైన ధరల్లో ఎరువులు… pic.twitter.com/C0A2O1kWPI