- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిట్టీల పేరుతో 100 కోట్లు మోసగించిన పుల్లయ్య అరెస్టు
by Kalyani |

X
దిశ, ఖైరతాబాద్: చిట్టీల పేరుతో వేల మందిని మోసగించి రూ.100 కోట్లతో ఉడాయించిన పుల్లయ్య అనే వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని బెంగళూరులో అరెస్టు చేసి నగరానికి తరలించారు. ఏపీలోని అనంతపురానికి చెందిన పుల్లయ్య చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడ రవీంద్రనగర్లో ఉంటూ తాపీమేస్త్రీగా పని చేసేవాడు. చాలా ఏళ్లుగా చిట్టీలు నడుపుతున్న అతడు వందల మందిని మోసగించి గత నెల రూ.100 కోట్లతో పరారైన విషయం తెలిసిందే. దీంతో పలువురు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. పుల్లయ్యను బెంగళూరులో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. స్వాహా చేసిన డబ్బును బెంగళూరు ప్రాంతంలోని పలువురు బిల్డర్లకు పుల్లయ్య పెట్టుబడి రూపంలో ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story