Tirumala News:తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు?.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
Tirumala News:తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు?.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తిరుమలలో గాజు బాటిళ్ల స్థానంలో మళ్లీ పాస్టిక్‌ బాటిళ్లను అనుమతించేందుకు టీటీడీ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని 2020లో తిరుమలలో ప్లాస్టిక్‌(Plastic) వినియోగాన్ని నిషేధించారు. ఈ క్రమంలో గాజు సీసాలు ప్రవేశపెట్టారు. లీటర్‌ బాటిల్‌ ధర రూ.50గా ఉంది. అయితే ఈ బాటిళ్లను మళ్లీ తిరిగి ఇస్తే రూ.30 ఇస్తారు.

కానీ చాలామంది భక్తులు(Devotees) ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏవైనా గొడవలు జరిగిన సందర్భాల్లో కొందరు భక్తులు గాజు బాటిళ్లను ఆయుధాలుగా వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా కొంతమంది ఒకరిపై ఒకరు గాజు సీసాలతోనే దాడులు చేసుకోవడంతో టీటీడీ(TTD) అప్రమత్తమైంది. ఈ క్రమంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లను వాడటంపై దృష్టి సారించింది. త్వరలోనే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed