- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తొలిసారిగా సామూహిక ట్రాన్స్‌జెండర్ల వివాహం.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: పేద జంటలకు పలు సేవ సంస్థలు సామూహిక వివాహాలు జరిపించటం తరచుగా చూస్తుంటాం. ఇందులో కేవలం అమ్మాయి, అబ్బాయికి మాత్రమే పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో ఎవరైనా ట్రాన్స్‌జెండర్లు, లెసిబియన్, గే.. LGBT కమ్యూనిటీకి చెందిన వారు పెళ్లి చేసుకోవాలనుకున్న సాయం చేసేందుకు ఎవరు ముందుకు రారు. కారణం.. సమాజంలో వీరంటే చులకన భావం. వారికి సాయం చేస్తే ఎక్కడ మనల్ని కూడా తక్కువ చేస్తారేమో అనే భయం. అలాంటిది, మహారాష్ట్రలో (Maharasta) అరుదైన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పింప్రి-చించ్‌వాడ్ (Pimpri-Chinchwad) నగరంలో 'నారి ది ఉమెన్' అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా తొలిసారి ఐదుగురు ట్రాన్స్‌జెండర్ జంటలకు పెళ్లి చేసింది. కాలేవాడిలోని బాలాజీ లాన్స్‌లో హిందూ వివాహ చట్టం ప్రకారం వారికి నిశ్చితార్థం, మంగళస్నానం, ప్రధానం వంటి అన్ని కార్యక్రమాలను ఓకే రోజు నిర్వహించారు. ఈ జంటలు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారని, సమాజంలోని అడ్డంకుల కారణంగా అధికారికంగా వివాహం చేసుకోలేదని స్వచ్చంధ తెలిపింది. అందుకే వీరికి పెళ్లి జరిగించినట్లు చెప్పింది. పెళ్లి తర్వాత జంటలన్నీ ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. ఈ వివాహానికి పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు స్వచ్చంద సేవపై ప్రశంసలు కురిపిస్తున్నారు.