KITU: కార్మిక చట్టాలు ఐటీలో అమలు చేయాల్సిందే.. బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసన

by Ramesh N |
KITU: కార్మిక చట్టాలు ఐటీలో అమలు చేయాల్సిందే.. బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కార్మిక చట్టాలు ఐటీలో కూడా అమలు చేయాల్సిందేనని (Karnataka State IT/ITeS Employees Union (KITU)) ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మీద నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే పనిగంటలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఓ పాడ్ కాస్ట్‌లో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. దేశం ఉత్పాదకత, ప్రపంచంలోకెల్లా అత్యల్పంగా ఉందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా.. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగులకు కార్మిక చట్టాలు వర్తింప జేయాలని, ఇప్పటికే తమపై పని భారం ఎక్కువ అవుతోందని (KITU) ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed