చనువుగా ఉంటున్నాడాన్ని చంపేశారు..

by Kalyani |
చనువుగా ఉంటున్నాడాన్ని చంపేశారు..
X

దిశ,మహేశ్వరం: ఈనెల 22 తేదీన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి గూడ కు చెందిన సుధాకర్ హత్య కేసులో నిందితులను కందుకూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… కందుకూరు మండలం సరస్వతి గూడ గ్రామానికి చెందిన మొలగాసి సుధాకర్ (34) అదే గ్రామానికి చెందిన సల్ల శమంత(శశికళ) కు వివాహం జరుగక ముందు నుంచి సుధాకర్ కు పరిచయం ఉంది. శమంతకు వివాహం జరిగిన కొన్నాళ్ళకే భర్త గుండెపోటు తో మరణించాడు. అప్పటి నుంచి శమంత తన అమ్మగారి ఇళ్లైన సరస్వతి గూడ గ్రామంలో తన కూతురుతో కలిసి ఉంటుంది. సుధాకర్ శమంతను పెళ్లి చేసుకుంటానని చెప్పి శమంతతో చనువుగా ఉంటూ మాట్లాడేవాడు.

ఈ విషయం శమంత అన్న మాదరమోని శేఖర్ (33) ఫోటో గ్రాఫర్, తమ్ముడు మాదరమోని వినయ్(27) గతంలో సుధాకర్, శమంతను పలుమార్లు మందలించారు. ఈ నెల 22 తేదీన సుధాకర్ మధ్యాహ్న సమయంలో కత్తి పట్టుకుని శమంత వాళ్ళ ఇంటికి వెళ్లి శమంతకు గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు. శమంత అన్నదమ్ములు శేఖర్, వినయ్ లకు డబ్బుల విషయంలో సుధాకర్ తో గొడవ జరిగింది. అదే రోజు శమంత సుధాకర్ పై కందుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి తన తల్లి వసంత ను బైక్ పై ఎక్కించుకొని సాయంత్రం 5:30 సమయంలో కందుకూరు వైపు వెళ్తుండగా సుధాకర్ ను చంపాలని శేఖర్ వినయ్ పథకం వేసుకున్నారు. వినయ్ తన ఆక్టీవా బండితో సుధాకర్ ను ఫాలో చేశాడు. అప్పటికే కందుకూరు నుంచి వస్తున్న శేఖర్ కు వినయ్ ఫోన్ చేశాడు.

సుధాకర్,తన తల్లి వసంత బైక్ మీద లేమూర్ గ్రామం దాటగానే శేఖర్ ఎదురుగా వచ్చి సుధాకర్ బైక్ ను ఢీ కొట్టాడు. సుధాకర్, తన తల్లి వసంత కింద పడ్డారు. వెంటనే శేఖర్ , వినయ్ లు కట్టెతో,సిమెంట్ ఇటుకతో సుధాకర్ ముఖముపై, ఛాతీ భాగంలో విచక్షణ రహితంగా పలుమార్లు కొట్టారు. అడ్డువచ్చిన వసంతను కాలుతో తన్ని రాయితో కొట్టారు. శేఖర్,వినయ్ లు అక్కడి నుంచి పారిపోయారు. సుధాకర్ ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చనిపోయాడు. మృతుని తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం టీములు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మహేశ్వరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

Next Story