- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tealangana Assembly : బెల్టు షాపులు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది : అసెంబ్లీలో జూపల్లి ఫైర్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశా(Telangana Assembly Sessions)ల్లో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishnarao) బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి(MLA Prashanth reddy) అడిగిన మద్యం అమ్మకాలపై ప్రశ్నకు జూపల్లి సమాధానం ఇస్తూ.. గతంలో BRS ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని 2014లో రూ. 9,000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని, 2023 వరకు రూ. 34,000 కోట్లకు ఎలా పెంచిందో అందరికీ తెలుసని అన్నారు. చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి, వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ ఆపడానికి దాడులు చేస్తోందని, ఫామ్‌హౌస్‌లలో మద్యం తాగడాన్ని నిషేధించిందని సమాధానం ఇచ్చారు.
ప్రశాంత్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు.. రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KomatiReddy Venkata Reddy) సమాధానం ఇస్తూ... ఆర్ఆర్ఆర్(RRR) పనుల కోసం భూసేకరణ పనులకు అనుమతి వచ్చిందని.. నిధుల విడుదలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని త్వరలోనే కలుస్తున్నామని చెప్పారు. విపక్ష నేతల నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయడం లేదు అనేది అబద్దం అని... హరీష్ రావు, కేటీఆర్ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం, నూతన రోడ్లకు చాలినన్ని నిధులు కేటాయిస్తున్నామని వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు.