Jyothika: ‘మీ జీవితానికి మీరే CEO అవ్వండి’.. సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Anjali |
Jyothika: ‘మీ జీవితానికి మీరే CEO అవ్వండి’.. సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో సూర్య సతీమణి.. నటి జ్యోతిక (Jyothika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. షాక్ సినిమాలో రవితేజ సరసన అవకాశం కొట్టేసిన జ్యోతిక.. తర్వాత చంద్రముఖి మూవీలో అవకాశం సంపాదించుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది జ్యోతిక.

వాలి, డుం డుం డుం, ఝాన్సీ ఠాకూర్, దొంగ, 36 వయసులో, జాక్ పాట్, బంగారు తల్లి, రక్తసంబంధం, కథల్: ది కోర్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. 36 వయసులో, మగువలు మాత్రమే, పొన్మగల్ వందాళ్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ వంటి సినిమాలకు జ్యోతిక నిర్మాతగా కూడా వ్యవహరించి తనలోని ప్రతిభను బయటపెట్టింది.

ఇప్పటికి కూడా ఈ నటి కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టిల్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన భారీ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఫ్యామిలీతో సహా జ్యోతిక ముంబయికు మకాం మార్చినట్లు సోషల్ మీడియా టాక్. ఇక జ్యోతిక తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోలిస్ ఆఫీసర్‌‌గా నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఇందులో ఈ నటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన నటనతో ఇరగదీసింది. ఇకపోతే ఈ నటి సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా జ్యోతిక అదిరిపోయే ఫొటోలు పంచుకుని.. వాటికి ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘మీ జీవితానికి మీరే CEO అవ్వండి’ అని జోడించింది. ప్రస్తుతం ఈ సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story