రాష్ట్రంలో మరో సంచలనం.. చేతబడి నెపంతో గిరిజన యువకుడి దారుణ హత్య

by Mahesh |   ( Updated:2025-03-22 04:47:00.0  )
రాష్ట్రంలో మరో సంచలనం.. చేతబడి నెపంతో గిరిజన యువకుడి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: చేతబడి (Black Magic) చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని గ్రామస్థులు సజీవ దహనం చేసిన ఘటన అల్లూరి జిల్లా డుంబ్రిగూడలో చోటు‌చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గిరిజన యువకుడు చేతబడి (black magic) చేస్తున్నాడని గ్రామస్తులు అతడిపై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి యువకుడిన నిర్భందించిన గ్రామస్తులు ఏకంగా అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం అందుకున్న జిల్లా డీఎస్సీ (District DSP) షెహబాజ్ అహ్మద్ హుటాహుటిన డుంబ్రిగూడకు చేరకుని పరిస్థితి సమీక్షించారు. పలువురు గ్రామస్థులను అదుపులోకి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed