- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

దిశ, వెబ్ డెస్క్: వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ (Delimitation) చేసి దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లను తగ్గించే ప్రయత్నం చేస్తుందని తమిళనాడు తీవ్ర ఆందోళన చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ రెండు రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం (All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీఎంలతో పాటు పంజాబ్ సీఎం, బీఆర్ఎస్ ఇతర పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం అఖిలపక్ష సమావేశంలో.. డీలిమిటేషన్‌ను న్యాయబద్దంగా చేయాలని జనభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ సీట్ల సర్ధబాటు చేయాలని డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం (Central Govt) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన డీలిమిటేషన్ లో దక్షిణాది సీట్లు సీట్లు తగ్గకూడదు.. నేను కూడా అదే కోరుకుంటానని స్పష్టం చేశారు. అలాగే "ఎన్డీఏ కూటమి (NDA alliance) సభ్యుడిగా చెబుతున్నా దక్షిణాదికి సీట్లైతే కచ్చితంగా తగ్గవు" అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భరోసా ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన పై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరగనపుడు ముందే రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, తాను ఎప్పుడు ఎప్పుడు మాట మార్చలేదని.. ప్రజలపై బలవంతంగా ఇతర భాషలను రుద్దే ప్రయత్నాన్ని తాను ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతకు ముందు తమిళనాడులో జనసేన పార్టీ విస్తరింపు స్పందిస్తూ.. తాను ఏది ముందు ప్లాన్ చేసుకోనని.. తమిళ ప్రజలు (Tamil people) ఆ వాతావరణాన్ని సృష్టిస్తే జనసేన అక్కడ రంగంలోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చారు.
Read More..