అమానవీయం.. మ్యాన్ హోల్‌లో శిశువు మృతదేహం

by Aamani |
అమానవీయం.. మ్యాన్ హోల్‌లో శిశువు మృతదేహం
X

దిశ, శేరిలింగంపల్లి : నగరంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. నగరంలో గత రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు, డ్రైనేజీలు నీటితో నిండిపోయాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి చాలా చోట్ల కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే హైటెక్ సిటీలో భారీ వర్షానికి పలు మ్యాన్ హోల్స్ నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. భారీ వర్షానికి మాదాపూర్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మ్యాన్ హోల్ నుండి శిశువు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేపట్టారు. మ్యాన్ హోల్ లోకి శిశువు మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed