వరుణ్ తేజ్ ‘vt-15’చిత్రానికి ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే?

by Hamsa |   ( Updated:2025-03-26 12:04:23.0  )
వరుణ్ తేజ్ ‘vt-15’చిత్రానికి ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే?
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ హిట్ సాధించలేకపోతున్నాడు. వరుస చిత్రాలు చేసినప్పటికీ విజయం అందుకోలేకపోతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే వరుణ్ తేజ్ గత ఏడాది ‘మట్కా’(Matka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది.

ప్రస్తుతం మెగా హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘VT-15’.గాంధీ మేర్లపాక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations), ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ‘VT-15’ షూటింగ్ మొదలు కానప్పటికీ ఓ పోస్టర్ విడుదలై అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ‘VT-15’ షూటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈసారైనా మెగా హీరో హిట్ కొడతాడో లేదా చూడాలని నెటిజన్లు అంటున్నారు.

Next Story