Prakash Raj: హీరోలకి పోటీ వస్తున్న ప్రకాశ్ రాజ్.. లేటెస్ట్ పోస్టర్‌తో నెటిజన్లు షాక్

by sudharani |   ( Updated:2025-03-27 12:39:46.0  )
Prakash Raj: హీరోలకి పోటీ వస్తున్న ప్రకాశ్ రాజ్.. లేటెస్ట్ పోస్టర్‌తో నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack). ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అలాగే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘జాక్’ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఆయన బర్త్‌డే కాడవంతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘జాక్’ చిత్రం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ పోస్టర్‌లో ప్రకాశ్ రాజ్ లుక్ యంగ్ హీరోలా కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు నెటిజన్లు. ఏంటీ.. ఆ లుక్ హీరోకి పోటీ వస్తారా అంటూ కొందరూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed