సూర్యాపేట డీఎస్పీ.. డీజీపీ కార్యాలయానికి అటాచ్..

by Aamani |
సూర్యాపేట డీఎస్పీ.. డీజీపీ కార్యాలయానికి అటాచ్..
X

దిశ,సూర్యాపేట : తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రయ్య గౌడ్ ను సొంత కుటుంబ సభ్యులే అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.. మృతుడు కుటుంబ సభ్యులు మొదటి నుంచి పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.కేసులో ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోయేలా పోలీసులు సహకరించారని, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసును పక్కదారి పట్టించారని, ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు కుటుంబ సభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఫిర్యాదు చేశారు.

చక్రయ్య హత్యపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ అధికారిగా ఐజి సత్యనారాయణ ను నియమించగా, హత్య జరిగిన తరువాత,జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకొని మంగళవారం తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్ ను జిల్లా ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ మల్టీ జోన్ - 2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్య కేసులో సూర్యాపేట సబ్ డివిజన్ (డీఎస్పీ) అధికారి జి .రవి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర పోలీసు అధికారులు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిరని సూర్యాపేట డీఎస్పీ రవి ని బాధ్యుని చేస్తూ డీజీపీ కార్యాలయానికి కి అటాచ్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట (ఇంచార్జ్) డీఎస్పీ గా కోదాడ డీఎస్పీ శ్రీధర్ కి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే ఐజి సత్యనారాయణ హెచ్చరించారు.ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తుందని ఐజి తెలిపారు.

Next Story