డిప్యూటీ సీఎంపై స్టాండప్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. హోటల్‌ను ద్వంసం చేసిన కార్యకర్తలు

by Mahesh |
డిప్యూటీ సీఎంపై స్టాండప్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. హోటల్‌ను ద్వంసం చేసిన కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM of Maharashtra) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) పై స్టాండప్ కమెడియన్ (Stand-up comedian) చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 23 ఆదివారం రాత్రి ముంబైలోని ఖార్‌లోని హోటల్ యూనికాంటినెంటల్‌లో జరిగిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) "నయా భారత్"లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేను "గద్దార్" (ద్రోహి) అని పరోక్షంగా సూచిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు 2022లో షిండే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంఘటనను ఉద్దేశించి.. "దిల్ తో పాగల్ హై" సినిమా పాటను స్పూఫ్ చేస్తూ సెటైర్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆగ్రహించిన షిండే నేతృత్వంలోని శివసేన సభ్యులు తీవ్రంగా స్పందించారు.

ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు (Shiv Sena workers) కామ్రా షో జరిగిన హోటల్‌పై దాడి (Attack on hotel) చేసి.. ఆస్తిని ధ్వంసం చేశారు. కమెడియన్ కామ్రా (Comedian Camra)ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివసేన నాయకుడు రాహుల్ కనాల్ ఈ ఘటనను "షిండే ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రణాళికాబద్ధమైన కుట్ర"గా అభివర్ణించారు. శివసేన ఎంపీ నరేష్ మ్హాస్కే కామ్రాను హెచ్చరిస్తూ, అతను దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగలేని విధంగా చేస్తామని, బాలాసాహెబ్ థాకరే శివ సైనికులు అతన్ని వదిలిపెట్టరని హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ దాడిపై శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే (Aditya Thackeray) తీవ్రంగా ఖండించారు. కామ్రా చెప్పినది 100% నిజమని.. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కామ్రాకు మద్దతుగా వీడియోను షేర్ చేసి.. "కునాల్ కీ కమాల్, జై మహారాష్ట్ర" అని రాశారు.

Next Story