- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ యాప్స్ తో ఖేల్ ఖతం.. వారెవ్వా ఇదేమి మోజు..

దిశ, అలంపూర్ : మీ సెల్ ఫోన్లలో ఆ యావ్స్ ఉన్నాయా.. ఒక్కసారి షురూ చేద్దామా అని అనుకున్నామా... అంతే ఖేల్ ఖతం.. దుఖాన్ బంద్ అయ్యే వరకు మనల్ని వదలవు. అవే బెట్టింగ్ యాప్స్. యాప్ ఓపెన్ అవుతేనే అందాలతో ముద్దుగుమ్మలతో ఢర్టి బొమ్మలు... సులువైన ఏకైక మార్గం ఇదే అంటూ సినీతారల యాడ్స్.. ఇంకేమి డబ్బులు వేసుకో బెట్టింగ్ షురూ. ఒక్కసారి ఆ బెట్టింగ్ ఊబిలో వెళ్లినోళ్ళు తిరిగి వెనక్కి మల్లేదే లేదు... ఎంత అప్పులైనా సరే సెల్ ఫోన్స్ నుండి వేల రూపాయలు యాప్స్ లో వేసుకోవడం, ఆడుకోవడంతో వేళ మంది యువకులు బెట్టింగ్ యాప్ లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారు. ఈ మాయలో చిక్కుకొని బయటకి చెప్పుకోలేక... కనీసం ఇంట్లో వారికి కూడా తెలియనివ్వకుండా అప్పుల్లో కురుకుపోతున్నారు. ఏమైతదిలే మళ్ళీ ఒక్కసారి ఆడి పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకుందాం అని బయట పనిచేసి మరీ ఆడుతున్నారు. ఇలాంటి యువతకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా పది రూపాయల వడ్డీ వరకు ఇస్తూ పత్రాలు రాయించుకోవడం, లేదా వారి నుండి వాహనాలు, గోల్డ్ చైన్స్, బైక్స్ గిరవ పెట్టుకుని అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు.
ప్రతి గ్రామంలో ఇదే..
బెట్టింగ్ యాప్‌ల పేరుతో ఆన్ లోనే గంటలకు వందల కోట్ల వ్యాపారం. రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. లక్షల్లో నష్టపోతున్న నిరుపేద ప్రజలు.. ప్రతి గ్రామంలో విస్తరించిన బెట్టింగ్ మార్కెట్.. సంపాదనలో 75 నుండీ 100 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే.. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ నిర్వహకుల పై చర్యలు ఉండవా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు సాహసం చేసి ఆ యాప్లను రద్దు చేయడం లేదు.
సెల్ ఫోన్స్ లో ఆ యాప్స్ ఉండడమే కారణం..
ప్రతి ఒక్కరి సెల్ ఫోన్స్ లో బెట్టింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ కావడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా బెట్టింగ్ జోరుగా సాగుతుంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లు అధికం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధం చేయాలి. ఇతర దేశాల బెట్టింగ్ యాపులను పేరు మార్చి మన దేశంలో వీటిని విడుదల చేయడంతో యువత నష్టపోతున్నారు. ప్లే స్టోర్ యాప్ నుండి వీటిని తొలగిస్తే తప్ప బెట్టింగ్ భూతం బయటికి పరిస్థితి ఏర్పడింది.
రోజుకు ఎంతోమంది బెట్టింగ్ ప్రాణాలు కోల్పోతున్న యాప్స్ యాజమాన్యానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్‌లు చలామణిలో ఉన్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. బెట్టింగ్ యాప్‌ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం ఒకరే. సాఫ్ట్‌వేర్ కోసం ప్రతి నెల కొంతమొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా రోజుకు వందల కోట్ల రూపాయలను నిర్వహకులు సంపాదిస్తున్నారు. ఈజీగ డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్‌లను ఒక మార్గంగా ఎంచుకుంటూ.. సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. భవిష్యత్తులో వీటిని సెలబ్రెటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు.
కానీ ఇప్పటికే బెట్టింగ్‌కు బానిసలుగా మారిన వారిని కాపాడటం కష్టమే. నేరుగా బెట్టింగ్ యాప్ నిర్వహకులు, బెట్టింగ్ యాప్‌లకు సాఫ్ట్‌వేర్ విక్రయిస్తున్నవారి పై చర్యలు తీసుకుంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. సెలబ్రటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువుగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్‌లో రిజిస్ట్రర్ కావాలంటూ ఆకర్షించడంతో పాటు.. జాయినింగ్ బోనస్ రూ.500 వరకు ఫ్రీగా పొందండనే ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తీరా జాయినింగ్ బోనస్‌తో ఆడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదు. అంతే ఒక్కసారి బెట్టింగ్ వలలో పడినమంటే చేపల వేటగాడికి చిక్కినట్టే.
ఫస్ట్ ఇస్తారు చివరకు లాక్కుంటారు...
ఫస్ట్ డిపాజిట్ కంపల్ సరీ అని బెట్టింగ్ యాప్ నిర్వహకులు షరతులు విధిస్తారు. దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వెయ్యి రూపాయిలు డిపాజిట్ చేసిన తర్వాత రూ.5 నుంచి రూ.10వేలు వచ్చాయనుకోండి.. డబ్బు పై ఆశతో అవి ఇంకా పెరుగుతాయనే ఆశతో ఆడి మొత్తం డబ్బులు పొగొట్టుకుంటారు. ఫస్ట్ అని సంబరపడి చివరి వరకు ఆటలు ఆడి వరకు ఆన్లైన్ గేమ్ మాత్రం మనల్ని వదలదు.
సీజన్ బట్టి యువతలో మార్పులు..
వేసవి సీజన్ వచ్చిందంటే ఐపీఎల్ వైపు యువత పరుగులు తీస్తాడు. 24/7 సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏ మ్యాచ్ ఆడితే డబ్బులు వస్తాయో అని ఎదురు చూస్తూ బెట్టింగ్ వైపు వెళ్తాడు. తాను వెళ్లే మార్గం ఎటువైపు వెళుతుందో తెలియకుండానే అందులో నిమగ్నమై చాలా లోతు వరకు వెళ్లిపోతాడు. చేతిలో చిల్లగవ్వ కనిపించకపోవడం.. ఎవరికి చెప్పుకోలేక... ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తారు. మరి కొంతమంది యువత ఆడవాళ్ళ మోజులో చిక్కుకొని బ్లాక్ మెయిల్ తో లక్ష రూపాయలు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. స్మార్ట్ ఫోన్స్ రావడమే ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ల్యాండ్ ఫోన్స్ నార్మల్ ఫోన్స్ ఉన్నప్పుడు ఇలాంటి బెట్టింగ్ ఉండకపోవడంతో లక్షల్లో ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ రావడంతోనే అధికంగా యువత బెట్టింగ్ దందాకు బానిస అవుతున్నారు. ఏది ఏమైనా బెట్టింగ్ యాప్స్ ను సెల్ ఫోన్ నుండి తొలగించే తప్ప మార్పులు చోటు చేసుకోవు. సెల్ ఫోన్స్ లో వీటిని డౌన్లోడ్ చేయడానికి వీలు లేకుండా లాక్ సిస్టం రావాలి. లేదా స్మార్ట్ సెల్ ఫోన్ పూర్తిగా తొలగించాలి.