30 గంటలు దాటినా.. వంతెన కింద తొలగని వర్షపు నీరు

by Mahesh |
30 గంటలు దాటినా.. వంతెన కింద తొలగని వర్షపు నీరు
X

దిశ, శంకర్ పల్లి : ఫతేపూర్ ఫ్లైఓవర్ వంతెన కింద శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. శనివారం తెల్లవారుజామున ఆరు గంటల నుంచి శంకరపల్లి నుండి వికారాబాద్, చేవెళ్ల వైపు వెళ్లే వాహన దారులు వర్షపు నీటి నుంచి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలు మినహా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు నీటిలో మునిగిపోవడంతో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ ఆర్ అండ్ బీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అందరూ వచ్చి ఫ్లైఓవర్ వంతెన కింద నిలబడి వర్షపు నీటిని తొలగించే విషయమై చర్చిం చారు. కానీ 30 గంటలు దాటినా రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అధికారులు వచ్చారు.. చూశారు.. చర్చిం చారు.. కానీ కనీసం రోడ్డుపై నిలబడి వాహనదారులకు ఇబ్బంది అయినా నీటిని తొలగించడంలో మాత్రం వారి పనితీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని వాపోతున్నారు.

రైతులకు ఇబ్బందులు

మున్సిపల్ అధికారులు వర్షపు నీటిని తొలగించకపోవడంతో రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్‌ కు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన కింద వర్ష పు నీటిని తొలగించకపోవడంతో కూ రగాయ పంటలు మార్కెట్‌కు ఎలా తరలించాలని రైతులు ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రకటనలు చేస్తున్న నాయకులు.. 30 గంటలు దాటినా వంతెన కింద నీటిని తొలగించక పోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా పార్టీలు మారి పదవులు పొందుతున్న ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సమస్యలు పట్టించుకోవాలి..

ప్రజా ప్రతినిధులు రోజుకో పార్టీ మారడం కాదు.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ వంతెన కింద చిన్నపాటి వర్షపు నీటికి రాకపోకలు బంద్ అయిన విషయం తెలిసిందే. 30 గంటలు దాటుతున్నా ఫ్లైఓవర్ వంతెన కింద నిలబడిన వర్షపు నీటిని తొలగించడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. మున్సిపల్ అధికారులు కనీసం తాత్కాలికంగా రోడ్డుపై నుంచి మోటార్‌తో‌నైనా నీటిని తోడి వేయకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed