- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? .. భారీ జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే!

దిశ,వెబ్‌డెస్క్: ఇంటర్(Inter) పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హత(Inter qualification)తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-63,200 జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ మార్చి 20న విడుదలైంది. మార్చి 22న అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను www.crridom.gov.in సందర్శించవచ్చు.