రేషన్ కార్డు దారులకు శుభవార్త.. అసెంబ్లీలో ఉత్తమ్ కీలక ప్రకటన

by Veldandi saikiran |
రేషన్ కార్డు దారులకు శుభవార్త.. అసెంబ్లీలో ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రేషన్ కార్డుదారులకు ( Ration Cards ) అదిరిపోయే శుభవార్త చెప్పారు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy.) బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు ఇకపైన పూర్తి స్థాయిలో అందిస్తామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చౌక ధరల దుకాణాల్లో ఇకనుంచి రేషన్ బియ్యం తో పాటు నిత్యవసర సరుకులు ( Essential goods ) పంపిణీ చేస్తామని వివరించారు. లబ్ధిదారులు ఇకపైన రేషన్ షాపుల్లో... నిత్యవసర సరుకులు తీసుకువెళ్లాలని... కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కూడా పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే SLBC లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై కూడా కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్.


ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. మిగిలిన డెడ్ బాడీలను త్వరలోనే బయటకు రెస్క్యూ టీం తీసుకువస్తుందని వివరించారు. సహాయక చర్యలు పూర్తికాగానే ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. డెడ్ బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కానీ గులాబీ పార్టీ నేతలు.... తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టులు పనులు ప్రారంభి స్తామని కూడా వివరించారు. కాలేశ్వరం పై ( Kaleshwaram) విజిలెన్స్ రిపోర్ట్ తమకు అందిందని ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy).

Next Story

Most Viewed