Varun Tej: అనౌన్స్‌మెంటే ఈ రేంజ్‌లో ఉంటే.. మూవీ ఏ రేంజ్‌లో ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న మెగా హీరో వీడియో

by sudharani |
Varun Tej: అనౌన్స్‌మెంటే ఈ రేంజ్‌లో ఉంటే.. మూవీ ఏ రేంజ్‌లో ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న మెగా హీరో వీడియో
X

దిశ, సినిమా: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ‘VT-15’ కోసం సిద్ధం అవుతున్నాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్ (Indo-Korean horror comedy thriller) బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుంది. గతేడాది ‘ఆపరేషన్ వాలెంటైన్, మట్కా’ వంటి చిత్రాలతో వచ్చినప్పటికీ.. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరడంతో వరుణ్ తన ఆశలన్నీ ‘VT-15’ పైనే పెట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాను సరికొత్త జోనర్‌లో ప్రేక్షకులను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఓ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌(Experience)ను కలిగించేందుకు తాజాగా.. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మేరకు ‘ఈసారి బ్లాక్‌బస్టర్ ఎక్స్‌ప్రెస్ రూట్ (Blockbuster Express Route).. కొరియా చలి ఇండియా థ్రిల్‌ను మీట్ అవ్వబోతుంది. #VT15 షూట్ సూపర్ ఫన్ ప్రోమోతో ప్రారంభమవుతుంది.. భయంకరంగా, ఉల్లాసంగా, వెంటాడేలా ఉండబోయే ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి’ అంటూ వీడియో షేర్ చేశారు. ఇందులో.. వరుణ్ ఓ డార్క్ రూమ్‌లో ఉండగా అక్కడకి కమెడియన్ సత్య (Comedian Satya) ఎంట్రీ ఇస్తాడు.

‘ఇంకేంటి బ్రో.. నెక్ట్స్ ఏ రూట్.. యాక్షన్ రూటా.. రెట్రో రూటా.. ఆపరేషన్ రూటా.. స్పెస్ రూటా’ అంటూ వరుణ్‌కు ప్రశ్నలు వేస్తాడు సత్య. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా.. ‘ఈసారి మనం వెళ్లే రూట్ ఎక్స్‌ప్రెస్ రూట్’ అంటూ సత్యతో కలిసి నవ్వులు పూయిస్తాడు వరుణ్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. అనౌన్స్‌మెంటే ఈ రేంజ్‌లో ఉంటే.. మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్ (UV Creations) నిర్మిస్తుండగా.. తమన్ (Taman) సంగీతం అందిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రితికా నాయక్ (Ritika Nayak) నటిస్తుంది.

Next Story