- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంచు విష్ణు కీలక నిర్ణయం..ఆ స్టార్ హీరో కోసం ఆ సినిమా వదిలేయడానికి కూడా సిద్ధమేనంటూ ఆసక్తికర కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’(Kannappa). దీనిని ఆయన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కన్నప్ప’ చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), మధుబాల, ముఖేష్ రిషి, రఘుబాబు, శివ బాలాజీ వంటీ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి రానుంది. దీంతో గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ‘కన్నప్ప’చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇదంతా శివలీలే అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మొదలైనప్పటి నుంచి నేను చాలా చేంజ్ అయ్యా.. నా జీవితం కూడా మారింది. ఈ మూవీ నాకు ఒక బిడ్డలాగా అయింది. తిన్నడు కథే ఈ సినిమాలో చూపించాము. అయితే దేవుడిని ద్వేషించేవాడే శివుడి అనుగ్రహం ఎలా పొందాడు అనే విషయాలు ఇందులో ఉంటాయి. తిన్నడు కన్నప్పగా మారిన సన్నివేశాల నుంచి షూటింగ్ పూర్తి అయ్యేవరకు నేను నేలపైనే పడుకున్నాను. ప్రభాస్ కనుక ‘కన్నప్ప’ సినిమా చేస్తా అని ఉంటే.. అప్పుడే వదిలేసేవాడిని. ఇప్పటికైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రభాస్ అంటే తనకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసేలా చెప్పాడు.