- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గురుకుల సెట్ ఫలితాలు విడుదల.. వైబ్సైట్ లో మెరిట్ లిస్ట్

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల సెట్(కేటగిరి ఎంట్రెన్స్టెస్ట్) ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలో ప్రత్యేక కేటగిరికి చెందిన మొత్తం 13,927 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మొదటి దశలో 1944 మంది విద్యార్థులు సీటు పొందారని గురుకుల సెట్ చీఫ్ కన్వీనర్ డాక్టర్ వీఎస్. అలగు వర్షిణి తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో (టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్), (టీజీటీ డబ్ల్యూఆర్ఈఐఎస్), (టీజీఎంబీపీడబ్ల్యూఆర్ఐఈఎస్), టీజీఆర్ఈఎస్) 5వ తరగతిలో ప్రవేశానికి గత నెల ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
ఇందులో ప్రత్యేక కేటగిరికి చెందిన వికలాంగులు(పీహెచ్సీ), (ఆర్ఫన్ అనాధలు), ఫిషర్ మన్(మత్స్యకార్మికులు), మైనార్టీ, సీఏపీ, ఈడబ్ల్యూఎస్, ఏఈక్యూ, ఏజెన్సీ ఏరియా ఎంబీసీ కేటగిరికి చెందిన ప్రవేశ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేశామన్నారు. అలాగే 5 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు. నేటి నుండి దశల వారీగా ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలను www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని ఆలగు వర్షిణి వివరించారు.