ప్రీమియర్ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ విజయం..

by Sumithra |
ప్రీమియర్ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ విజయం..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో శనివారం జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ, బీఎంఎస్ కూటమి ఘనవిజయం సాధించింది. సీఐటీయూ పై 30 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ కేవీ గెలుపొందింది. బీఆర్ఎస్ కేవీకి 209 ఓట్లు రాగా, సీఐటీయూకు 179, హెచ్ఎంఎస్ కు 1, బీఎంఎస్ కు 1 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్, పీఈఎల్ కంపెనీ బీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి మాటాడుతూ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కార్మికులకు 12వ వేతన ఒప్పందాన్ని చేసి చూపిస్తామన్నారు.

బీఆర్ఎస్ కేవీ యూనియన్‌ కు ఇది హ్యాట్రిక్ విజయమని, నాలుగు యూనియన్లు ఒక్కటైనా కూడ తమ యూనియన్ ను కార్మికులు ఆదరించినందుకు సంతోషమన్నారు. కార్మికులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు, యాజమాన్యాన్ని ఒప్పించి మంచి అగ్రిమెంట్ కార్మికుల కోసం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎమ్ఎస్ జిల్లా అధ్యక్షులు యాదిరెడ్డి, జనరల్ సెక్రటరీలు నాగేందర్ రెడ్డి, బరిగె నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు రాంచందర్ రెడ్డి, జలేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, రాము, పాపయ్య, లక్ష్మీనర్సయ్య, రమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య తదితరులున్నారు.

Next Story