సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవం : మంత్రి వెంకటరెడ్డి

by Aamani |   ( Updated:2025-04-05 13:51:08.0  )
సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవం : మంత్రి వెంకటరెడ్డి
X

దిశ,నార్కట్ పల్లి : సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నార్కట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెం లో మేడి అరుణ ఇంట్లో సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి భుజించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతుందని ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు,రూ. 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ గృహ జ్యోతి రైతు భరోసా రైతు బీమా రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రాజీవ్ యువశక్తి పథకంగా నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కింద ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లా నుంచి సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టడం గొప్ప పరిణామం అన్నారు. 20 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో కొత్తగా చేర్చడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో మూలన పెట్టిన బ్రాహ్మణ వెల్లంల పథకాన్ని 100 కోట్లతో నీటిని తీసుకురావడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంలో పేదల కలలో ఆనందం చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో యానాల అశోక్ రెడ్డి, తహసిల్దార్ ఎల్ వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊశయ్య గౌడ్, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, జేరిపోతుల భరత్, ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed