- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Amit Shah: ఆయుధాలు, హింస మార్పుని తీసుకురాలేవు- అమిత్ షా

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వరుస ఎన్‌కౌంటర్లతో నెత్తురోడుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోలు హతమయ్యారు. అయితే, కాగా.. ఈ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్.. భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సాయుధ తిరుగుబాటులో పాల్గొంటున్న వారు ఆయుధాలను వదిలిపెట్టాలని కోరారు. ఆయుధాలు, హింస మార్పును తీసుకురాలేవని హితవు పలికారు. శాంతి, అభివృద్ధి మాత్రమే సమూల మార్పుని తీసుకొస్తాని చెప్పుకొచ్చారు. ఈ మేరకు అమిత్ షా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘నక్సలిజంపై మరో దాడి! సుక్మాలో జరిగిన ఆపరేషన్‌లో మా భద్రతా సంస్థలు 16 మంది మావోలను మట్టుబెట్టి, భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మేం నిర్ణయించుకున్నాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అతిపెద్ద ఎన్ కౌంటర్
సుక్మా జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లో ఇది ఒకటి. జిల్లా రిజర్వ్ గార్డ్స్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఘటనాస్థలి నుంచి 16 మంది మావోయిస్టుల డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయయని.. వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. మార్చి 22న అమిత్ షా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామని అన్నారు. 2004 నుంచి 2014 మధ్య 16,463 హింసాత్మక సంఘటనలు జరిగాయని.. అయితే గత పదేళ్లలో ఈ సంఖ్య 53 శాతం తగ్గిందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. 2004 నుండి 2014 వరకు 1,851 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని, అయితే గత పదేళ్లలో అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య 509కి తగ్గిందన్నారు. పౌర మరణాల సంఖ్య 4,766 నుండి 1,495కి తగ్గిందని చెప్పుకొచ్చారు. 2014 నుండి 2024 వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 11,503 కిలోమీటర్ల హైవేలు నిర్మించామని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 1 నాటికి మొత్తం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మొబైల్ కనెక్టివిటీతో అమర్చబడుతుందని మిస్టర్ షా పేర్కొన్నారు.