- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Amaravati: రాష్ట్రంలో మరో బృహత్తర కార్యక్రమం.. మరికొన్ని గంటల్లో ప్రారంభోత్సం

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం(Government) సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో శ్రీకారానికి ఏర్పాట్లు చేసింది. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పీ4 విధానాన్ని(P4 procedure) రాష్ట్రంలో అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు విధానాలను రెడీ చేసింది. ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉంది. ఇందుకు అమరావతిలోని సచివాలయం సమీపం వేదిక కాబోతోంది. ఉగాది సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ పీ4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్ర దృష్టా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బృహత్తరమైన ప్రాజెక్టును ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. ఇక్కడ వర్కౌట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
పేదలకు అండగా నిలబడటమే ఈ పీ4 విధానం ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు స్పష్టం చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం మందికి చేయూత ఇవ్వడమే పీ4 కార్యక్రమమని వెల్లడించింది. 2047 వరకు రాష్ట్రంలో పేదరికం సున్నాగా చేయడంలో భాగంగా ఈ పీ4 విధానాన్ని తీసుకొచ్చినట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మరికొన్ని గంటల్లో ఈ విధానం పురుడుపోసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సిద్ధమైంది. చూడాలి ఈ కార్యక్రమం ఎంత ఫలితాన్నిస్తుందో.