- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేణు- నితిన్ కాంబోలో వస్తున్న మూవీలో ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్.. సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చినట్టేనా అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు యెల్దండి(Venu Yeldandi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బలగం’(Balagam) సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగాడు. అసలు ఈ మూవీతో తనలో ఒక కమెడియన్ మాత్రమే కాకుండా ఓ మంచి దర్శకుడు కూడా దాగున్నాడు అని నిరూపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వేణు తీయబోయే నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే కొన్ని రోజుల క్రితం వేణు.. తన తరువాతి సినిమా ‘ఎల్లమ్మ’(Yellamma) అని టైటిల్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకగా ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీలో హీరోగా నితిన్(Nithin) ఫిక్స్ అయ్యారు. అయితే హీరోయిన్‌గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం రాగా.. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. సాయి పల్లవి(Sai Pallavi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. దీంతో కాల్షీట్ల డేట్లు కుదరకపోవడంతో ఎల్లమ్మ సినిమా నుంచి తప్పుకుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వేణు కీర్తి సురేష్(Keerthi Suresh)కు కథను వినిపించాడట.
ప్రస్తుతం ఆమె పాత్ర పై చర్చలు జరుగుతున్నాయని.. దాదాపుగా హీరోయిన్‌గా మహానటి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక యాక్టింగ్ పరంగా కీర్తి సురేష్ ఇరగదీస్తుందన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరుకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సాయిపల్లవి హ్యాండ్ ఇచ్చినట్టేనా అంటూ నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
Ananya Nagalla: దయచేసి అందరూ నన్ను క్షమించండి.. తప్పు చేశానంటూ ఎమోషనల్ పోస్ట్