ఒక్కొక్కటిగా బయటపడుతున్న జేఏవో అవినీతి...

by Aamani |
ఒక్కొక్కటిగా బయటపడుతున్న జేఏవో అవినీతి...
X

దిశ,మణుగూరు : పుట్టను తొవ్వితే చీమలు బయటకు వచ్చినట్లుగా మణుగూరు మున్సిపాలిటీ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కదిలిస్తే అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది.గత మూడు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పాతుకుపోయి తాను ఏం చేసిన అడిగేవారు లేకపోవడంతో మున్సిపాలిటీ సొమ్మంతా అందినకాడికి దోచుకున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.కార్యాలయంలో అకౌంటెంట్ ఆఫీసర్ గా ఉండి కార్యాలయ ఖర్చులు తక్కువ మొత్తం లో పెట్టి,ఎక్కువ మొత్తంలో ఖర్చు అయినట్లు బిల్లులు సృష్టించి కొన్ని లక్షల రూపాయలు డ్రా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్టేషనరీ దగ్గర నుంచి కార్యాలయ అకౌంట్స్ బిల్స్ వరకు లక్షల రూపాయలు మాయం చేశాడని ఆరోపణలు వినపడుతున్నాయి.

వచ్చిన ప్రతి కమిషనర్ కు మాయమాటలు చెప్పి,తాను చెప్పితే వినేటట్లు చేసుకొని లక్షల రూపాయలు వెనుక వేసుకున్నాడని ఇటు కార్యాలయ సిబ్బంది,అటు మున్సిపాలిటీ ప్రజలు అంటున్నారు.ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుంటూ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శలు కురిపిస్తున్నారు. అందుకే కాబోలు ఓ దెగ్గర రెండు కోట్లు పెట్టి ఇల్లు కూడా నిర్మిస్తున్నాడనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఒక అకౌంటెంట్ ఆఫీసర్ రెండు కోట్లు పెట్టి ఇల్లు నిర్మిస్తున్నాడంటే తాను ఎంత అవినీతి చేశాడో దీని బట్టి తెలుసుకోవచ్చు.జిల్లా కలెక్టర్,కమిషనర్ కార్యాలయ అకౌంట్స్ లెక్కలు మొత్తం పూర్తిగా చూపించి రామగుండం మున్సిపాలిటీకి వెళ్లాలని ఆదేశించారు.కానీ అకౌంట్స్ పేరుతో రామగుండం మున్సిపాలిటీకి వెళ్లకుండా పై అధికారులకు లక్షల్లో ముడుపులు చెల్లించి ఇక్కడే తిష్ట వేయాలని చూస్తున్నాడని వినపడుతోంది.

పట్టణ ప్రగతికి వచ్చిన రూ.27 లక్షల నిధులు ఎక్కడ..?

పట్టణ ప్రగతి అభివృద్ధి క్రింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 27 లక్షల నిధులు మంజూరు చేసింది.అయితే ఆ నిధులను పట్టణ ప్రగతి అభివృద్ధికి వినియోగించలేదని,రూ.27 లక్షలు అలాగే ఉన్నాయని కమిషనర్ చెప్పడం గమనార్హం.దీనిని గ్రహించిన జేఏవో ఆ రూ.27లక్షల 20లక్షల రూపాయలు ఓ బీఆర్ఎస్ కాంట్రాక్టర్ కు ఇవ్వాలని చూస్తున్నారని కొంత సమాచారం.పట్టణ ప్రగతికి ఖర్చు చేస్తే ఏమిరాదని గ్రహించి కాంట్రాక్టర్ ఇచ్చి 10% కమిషన్ తీసుకోవాలని చూస్తున్నడని వినపడుతోంది.అందుకే ఆ కాంట్రాక్టర్ కూడా మాటకి పది సార్లు మున్సిపాలిటీ కార్యాలయంకి రావడం గమనార్హం.ఆ రూ.27 లక్షల నిధులు పట్టణ ప్రగతి అభివృద్ధికి, సెంట్రల్ లైటింగ్ కి,డ్రైనేజీకి,మూలనపడ్డ మున్సిపాలిటీ వాహనాలకు ఉపయోగించాలని పట్టణ ప్రజలు,నాయకులు కోరుతున్నారు.

రూ.2 లక్షల 50 వేలు పెట్టి కొనుగోలు చేసిన 5 స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ..?

గత కమిషనర్ నాగప్రసాద్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ కార్యాలయానికి రూ.2 లక్షల 50 వేలు పెట్టి 5 స్మార్ట్ ఫోన్స్ కొన్నారు. అన్ని సెక్షన్ కి ప్రజల నుంచి సమాచారం అందాలని ఉద్దేశంతోనే ఆ స్మార్ట్ ఫోన్స్ కొన్నారని తెలుస్తోంది.అయితే గత కమిషనర్ నాగప్రసాద్ ట్రాన్స్ఫర్ కావడంతో కార్యాలయంలో ఉన్న ఓ ముగ్గురు అధికారులు ఆ 5 స్మార్ట్ ఫోన్స్ ను బయట వ్యక్తులకు వడ్డీ పావుసేరుకు అమ్ముకున్నారని వినపడుతోంది.మున్సిపాలిటీ సొమ్మును ఇంత దోచుకుంటుంటే మున్సిపాలిటీ సంబంధించిన రిజినల్ డైరెక్టర్ అధికారి ఏం చేస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కార్యాలయంలో సస్పెండైన అధికారులను 10సంవత్సరాల నుంచి పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.ఇప్పటికైనా రివిజినల్ డైరెక్టర్ అధికారి పట్టించుకోని జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్,సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ,సీనియర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లపై విజిల్స్ ఎంక్వయిరీ చేపించాలని పట్టణ ప్రజలు,స్థానిక నాయకులు కోరుతున్నారు.లేదంటే అన్ని ఆధారాలతో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడుతామని హెచ్చరిస్తున్నారు. మరి రిజినల్ డైరెక్టర్ అధికారి పట్టించుకుంటారో..లేదో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed