- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీరట్ ఘటన మరవకముందే మరో దారుణం.. పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో మీరట్ కేసు మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కుట్ర పన్ని పెళ్లయిన 15 రోజులకే భర్తను దారుణంగా హత్య చేయించింది. భర్తను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి రూ. 2లక్షల కాంట్రాక్టు ఇచ్చింది. ఔరయ్యలో వెలుగుచూసిన ఘటన ప్రకారం మార్చి 19న ఓ వ్యక్తి పొలంలో గాయాలతో పడి ఉన్నాడని సహారా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి మృతుడి భార్యే ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీస్ సూపరింటెండెంట్ అభిజీత్ శంకర్ మాట్లాడుతూ.. మృతుడు దీలీప్ వృత్తి రిత్యా డ్రైవర్ గా పని చేసేవాడని, అతడికి మార్చి 5న ప్రగతి అనే యువతితో వివాహం జరిగిందని తెలిపారు. అయితే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని, పెళ్లి కూడా తనకు ఇష్టం లేకుండానే జరిగిందని అన్నారు.
దిలీప్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, భర్తను వదిలించుకునేందుకు భార్య ప్రగతి ప్రియుడుతో కలిసి కుట్ర పన్నారు. భర్తను చంపించేందుకు బబ్లూ యాదవ్ అనే వ్యక్తితో రూ.2 లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. దిలీప్ కు మాయమాటలు చెప్పి పోలాల వైపు తీసుకెళ్లి, అతడిపై దాడి చేశారు. తర్వాత తుపాకీతో కాల్చి చంపి, పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కాంట్రాక్టు హంతకుడు, మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ అధికారి చెప్పారు.