- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపం పశ్చిమ తీరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రివర్టన్ తీరానికి సమీపంలో మంగళవారం ఉదయం (సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు స్థానిక కాలమానం ప్రకారం) 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకటన విడుదల చేసింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. భూప్రకంపనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
కాగా, న్యూజిలాండ్‌లో 1900 నుంచి 7.5 కంటే ఎక్కువ తీవ్రతతో దాదాపు 15 భూకంపాలను చవిచూశాయి. ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద భూకంపం 1931లో సంభవించింది. ఇది హాక్స్ బేలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, 256 మంది ప్రాణాలు కోల్పోయారు.